తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు ఈసందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు, మండల, పట్టణ నాయకులు భక్తులు ఘన స్వాగతం పలికి శాలువా పూల మాలతో ఘనంగాసన్మానించారు.
అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు.