తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పి యు నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం మార్కాపురం, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంభందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, గిద్దలూరు అర్బన్ సీఐ కె.సురేష్, కంభం సీఐ కె. మల్లికార్జునరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *