తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

బాపట్ల: బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ (ఆటోనమస్)లో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బయో-డిజిటల్ ఆల్కెమీ: గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇన్ ఏఐ–క్వాంటం ఎనేబుల్డ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ నెక్స్ట్-జెనరేషన్ స్మార్ట్ మెటీరియల్స్ అండ్ లైఫ్ సైన్సెస్” అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు , జాయింట్ సెక్రటరీ దొడ్డపనేని వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగాలలో ముఖ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, స్మార్ట్ మెటీరియల్స్ మరియు లైఫ్ సైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలకు ఈ అంతర్జాతీయ సదస్సు ఒక ముఖ్య వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సు మార్చి 23 నుండి 25 వరకు బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ విదేశాల నుండి ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు మరియు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారని వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా. బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా విద్యార్థులు మరియు పరిశోధకులకు కొత్త ఆలోచనలు, పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డా. చెన్నంశెట్టి సుబ్రహ్మణ్యం, కో-కన్వీనర్ డా. వి. మాధవరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కె. ప్రసాదరావుతో పాటు కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *