తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఈరోజు 28/03/2026 న ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న వారిని పరామర్శించి, మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మీడియాతో MRPS జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ….
కర్నూలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం మరియు ట్రావెల్స్ యాజమాన్యం నుండి దాదాపు ₹ 20 లక్షలు ఇచ్చి, మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం₹5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షలు మొత్తం₹7 లక్షలు ప్రకటించడం ఏంటి? పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి అంత చులకనా? తక్షణమే ₹20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.నిబంధనలకు విరుద్ధంగా, కనీస భద్రతా ప్రమాణాలు లేని బస్సులకు లైసెన్స్లు, పర్మిట్లు మంజూరు చేసిన సంబంధిత RTO అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారుల అవినీతి వల్లే ఈ ప్రాణాలు గాల్లో కలిశాయి.మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. సామాన్యుల భద్రతను గాలికొదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను వెంటనే రద్దు చేయాలి లేదా వాటిపై పూర్తిస్థాయి నియంత్రణ విధించాలి.ప్రగాఢ సంతాపం:
ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ కార్యక్రమంలో MRPS వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగ,msf రాష్ట్ర కన్వీనర్ పల్లెపోగు త్రిపుర మాదిగ,జిల్లా నాయకులు బక్క రాజు మాదిగ,దర్శి నియోజగ ఇంచార్జీ గంధం ఇర్మీయా మాదిగ,SN పాడు ఇంచార్జీ జడ్రాజుపల్లి బాల రాజు మాదిగ, కందుకూరు నియోజకవర్గ ఇంచార్జీ గౌడుపేరు కృష్ణ మాదిగ, కందుకూరు మండల అధ్యక్షులు గౌడుపేరు మహేష్ మాదిగ,sn పాడు మండల అధ్యక్షులు గుంటూరి చిట్టిబాబు మాదిగ, పొనుగోటి ఉదయ కుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, తదితరులు ఉన్నారు
