తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు వినూత్నంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అర్ధరాత్రి 1:00 గంట నుండి తెల్లవారుజామున 4:30 గంటల మధ్య జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నిద్రమత్తు మరియు అలసట కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో, హైవేలపై వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లు ముఖం కడుక్కునేలా చేసి, టీ అందిస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్లతో మాట్లాడుతూ.. కేవలం గమ్యం చేరడం మాత్రమే కాకుండా, మీ కోసం ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. కొద్దిపాటి విశ్రాంతి మరియు తాజాతనం ప్రాణాలను కాపాడుతాయని అవగాహన కల్పించారు. పోలీసుల ఈ చొరవ వల్ల రాత్రివేళల్లో జరిగే ఘోర ప్రమాదాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, ప్రయాణికులలో పోలీసుల పట్ల నమ్మకం మరియు కృతజ్ఞతా భావం పెరుగుతోంది. ఈ ‘Face Wash & Go’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతుందని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *