తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-

ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో ముండ్లమూరివారిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఆహ్వానం మేరకు పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమవారం జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
నేను కూడా ఇదే పాఠశాలలో 6 నుండి 10 తరగతి వరకు చదువుకున్న విద్యార్థినే, నాకు ఇదే పాఠశాలలో చదువు చెప్పిన గురువులు మాధవరావు (HM), కోటేశ్వరరావు , పాలడుగు కృష్ణ ప్రసాద్ (KP), గాలంకి మాల్యాద్రి , పద్మావతి , నిర్మలా , శ్రీనివాసరావు (తెలుగు ), రంపతోటి నరసింహం ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ మా గురువులందరికీ పాదాభివందనాలు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే గురువుల ప్రోత్సాహం నామీద ఎంతో ప్రభావం ఉంది, విద్యార్థులందరూ క్రమశిక్షణతో పట్టుదలతో బాధ్యతగా గౌరవంగా ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వింటే కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలి, అతి తొందరలో పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెబుతూ, జిల్లాలోనే మన పాఠశాల పేరు ప్రఖ్యాతలు పొందాలి, పాఠశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి ద్వారా నేను దగ్గరుండి చేపించే బాధ్యత తీసుకుంటాను, నేను చదువుకున్న పాఠశాలకు సోమవారం ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు పాఠశాల సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు కూడా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *