తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

దర్శిలో ఈ నెల 1న నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరీక్షించుకున్న వారిలో సుమారు 160 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. మొదటి విడతగా 10 మందిని దర్శి నుండి నరసరావుపేట కు స్వయంగా తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి తిరిగి సురక్షితంగా చేర్చారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు డా. గొట్టిపాటి లక్ష్మీ, డా. కడియాల లలిత్ సాగర్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా వారికి కూడా విడతల వారీగా ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని డా. లక్ష్మీ తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *