తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో, కొత్త గొల్లవిడిపి గ్రామం పొలాల్లో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుండి ₹12,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సామాజిక అశాంతికి దారి తీస్తాయని, ఇలాంటి చర్యలపై పోలీసులు నిరంతరం దాడులు కొనసాగిస్తారని తెలిపారు.ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు.