తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

దర్శి మున్సిపల్ పరిధిలోని శివరాజ్ నగర్‌లో క్రికెట్ స్టేడియం గ్రౌండ్‌ను జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, డా. కడియాల లలిత్ సాగర్, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ, యువతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు , డిసిఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడారంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు.ప్రకాశం జిల్లాలో తొలిసారిగా దర్శిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కావడం గర్వకారణమని, ఇది యువతకు క్రీడల ద్వారా భవిష్యత్ అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. త్వరలో మినీ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *