తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను వేగంగా పరిష్కరించి, ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి శ్రీ పోధిలి భార్గవనాథ్ గారి కుటుంబానికి జిల్లా కలెక్టర్ శ్రీ P. రాజా బాబు గారు చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ యూనియన్ బ్యాంక్ సాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ముఖ్యమైన పథకమని తెలిపారు.యూనియన్ బ్యాంక్ అధికారులు క్లెయిమ్‌ను తక్కువ సమయంలో పరిష్కరించడం తమ సేవా సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.