తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

ప్రముఖ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఏప్రిల్ 2 నుంచి 5 వ తేది వరకు నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి, షామియానాలు, విద్యుత్, వాహనాల సౌకర్యం ఇలా ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా రోడ్ల గుంతలను పూడ్చాలని తెలిపారు. ముఖ్యంగా తెప్పోత్సవం జరిగే గుండం దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లైఫ్ జాకెట్లను సిద్ధం చేసీ, చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా అటవీ మార్గంలో ఎలాంటి వాహనాల రద్దీ లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, డిఎంహెచ్వో వాణిశ్రీ, డీఎఫ్ఓ నిషా కుమారి, ఆలయ ఈవో నాగయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *