తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-

గత మూడు రోజులుగా అనగా ఏప్రిల్ 11వ తేదీ నుండి బీసీ లకు మద్దతుగా 5 డిమాండ్లు నెరవేర్చాలని మంగళగిరి వద్ద ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ కు సోమవారం రాజకీయ పార్టీలకు అతీతంగా గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంఘాలు మద్దతు పలికాయి. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ సమావేశం లో కంచర్ల కోటయ్య గౌడ్ మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ చెప్పిన 5 డిమాండ్లను 1) బీసీ రక్షణ చట్టం అమలు, 2) రాజధాని ప్రాంతం లో బీసీ లకు 1000 ఎకరాల భూ కేటాయింపు, 3) బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయింపు, 4) సమగ్ర కుల గణన మరియు 5) విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్ట సభలలో బీసీ లకు 44% రిజర్వేషన్ లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. బీసీ ల ప్రభుత్వం అని చెప్పే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లు నెరవేర్చి బీసీల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. అలాగే కటారు రాజా అరుణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు వాటా కల్పించే విధంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కృషి చేయాలని అలాగే రామచంద్ర యాదవ్ బీసీ ల కోసం డిమాండ్ చేస్తున్న 5 డిమాండ్లు గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే అని, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అమలు పరచలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తొండమల్ల బ్రహ్మయ్య, కేవి స్వామి కొండయ్య, తూర్పునాటి గోపాల్, పాలకవీటి బాల చెన్నయ్య, రామయ్య, కొప్పుల నరసింహులు, మేదర శ్రీను స్వామి గుండం గౌడ్, కొత్తకోట పెద్దిరాజు, చెన్నబోయిన రామకృష్ణ, పులుసు రామకృష్ణ, పందరబోయిన గంగయ్య, బట్టపోతుల రాజయ్య, మేకల బయన్న ఇంకా భారీగా బీసీలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *