తొలి శుభోదయం న్యూస్ :-
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోనీ కల్చరల్ సెంట్రల్ లో ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జగత్ ప్రకాష్ నడ్డా, ఇతర ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.