తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా మార్కాపురం జిల్లా కె.కె. మిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామం సమీప నేషనల్ హైవే వద్ద ఉన్న ప్రమాదకర మలుపును జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మలుపు వద్ద వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందేలా అక్కడ ఉన్న భారీ గేట్లపై రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయించడంతో పాటు, ఎదురుగా వస్తున్న వాహనాల కదలికలను స్పష్టంగా గమనించేందుకు కుంభాకార దర్పణాలను (Convex Mirrors) ఏర్పాటు చేయించారు.రాత్రి వేళల్లో మరియు తక్కువ దృష్టి ఉన్న పరిస్థితుల్లో ప్రయాణించే వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రమాదాలకు కారణమవుతున్న మలుపులను గుర్తించి, వాటిని సురక్షితంగా మార్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. ముఖ్యంగా వాహనాల అధిక వేగం, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో తగిన వెలుతురు వంటి వాటిని ఏర్పాటుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ప్రమాదాలకు కారణమయ్యే ప్రదేశాలలో ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టాలని, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా ఎస్పీ గారి వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, పొదిలి సిఐ రాజేష్ కుమార్, కె. కె మిట్ల ఎస్సై శ్రీకాంత్, నేషనల్ హైవే సంబంధించిన అవినాష్ మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *