తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని లెనిన్ నగర్ లో సిమెంట్ రోడ్డు నిర్మించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ప్రజా పిర్యాదుల వేదికలో ఏ ఓ శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా లెనిన్ నగర్ లో దాదాపు 50 మంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకొని ఉన్నారని వారు వినియోగిస్తున్న రోడ్డును ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ విషయం వారి ద్వారా మా దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు నిర్మాణానికి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ రోడ్డును ఆక్రమించి ఫ్లాట్లు వేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారని వారిని స్థానికులు అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న నిరుపేదల కుటుంబాల ప్రజలను బెదిరించటం సరైనది కాదని వారు హెచ్చరించారు. పేద ప్రజల అండగా ఉండాల్సిన మున్సిపల్ అధికారులు ఆక్రమణదారుల బెదిరింపులకు తలొగ్గి పేద ప్రజలపై విరుచుకు పడటం సరైనది కాదని ఆయన అన్నారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు అనుగుణంగా వారు నడిచే రోడ్డు ఆక్రమణకు గురికాకుండా అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలని ఈ సందర్భంగా ఆయన ఏఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఆనందమోహన్, లెనిన్ నగర్ నివాసులు తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *