తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:-
కురిచేడు మండలం, వెంగయపాలెం గ్రామంలోని సీతారాముల వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ కమిటీ వారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు పిడతల నెమిలయ్య, గ్రామ మరియు మండల స్థాయి నాయకులు, యువత, మహిళలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.