తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో…. కందుకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి విద్యార్థిని సోమవరపు శ్రీ జోషిత గ్రాండ్ ప్రైజ్ కింద ల్యాప్ టాప్, 3వ తరగతి విద్యార్థిని గ్రీష్మ… ట్యాబు బహుమతులుగా అందుకున్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో స్కూల్ నిర్వాహకులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు బి సురేష్, ఏజీఎం అంజయ్య, ఆర్ ఐ అనిల్ కుమార్, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, డీన్ బ్రహ్మయ్య, సి బ్యాచ్ ఇంచార్జ్ శివయ్య, ఉపాధ్యాయులు, విజేతల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.