తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-

నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ గా నూతనంగా ఎన్నికైన దేవరకొండ సుజాత దంపతులు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీసులు అందుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం నగరంలోని విపిఆర్‌ నివాసంలో వేమిరెడ్డి దంపతులను కలిసిన ఆమె.. వారిని శాలువాతో సత్కరించి ఆశీసులు అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు విపిఆర్‌ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసి కార్పొరేషన్‌ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *