తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-

కావలికి చెందిన 80 ఏళ్ల బామ్మ, వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మ ని ఆదివారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న ఆమెను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె జాతీయ స్థాయిలో సాధించిన పథకాలు చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వయసులో జాతీయ స్థాయిలో 32 స్వర్ణ, 14 సిల్వర్, 3 బ్రాంజ్ పథకాలు సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఇలాంటివారు ఎంతో మందికి ఆదర్శమని అన్నారు.రామ సుబ్బమ్మ తనకు ప్రభుత్వం తరఫున ఇల్లు కేటాయించేలా చూడాలని ఎంపీ దంపతులకు విజ్ఞప్తి చేయగా వారు తప్పకుండా ఇల్లు కేటాయించేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *