తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహైడ్రేషన్ కి గురికాకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు పిలుపు ఇచ్చారు. పోలీస్ సేవ ప్రజా సంబంధాల లో భాగంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి కాలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.సింగరాయకొండ కూడలి గ్రామ ప్రజలు ప్రయాణీకులు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపు ఇచ్చారు. నిత్యం సింగరాయకొండ కేంద్రంగా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారని అలాంటి వారికి పోలీస్ ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం ఎంతగానో ఉపయోగ పడుతుందని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఒంగోలు డి ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
