తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

విద్యార్థులకు నేటినుండి వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు వాతావరణం పట్ల జాగ్రత్తలు పాటించాలని వేసవి కాలం తీవ్రంగా ఉండటంతో స్కూల్ పిల్లల ఆరోగ్యo పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఒంగోలు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ కృష్ణ సూచనలు తెలియజేశారు.ఒంగోలు తాలూకా పరిధిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి ప్రమాదాల నేపథ్యంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వేసవిలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నందున
పిల్లలు ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని సూచించారు. ఈ సమయంలో ఎండ తీవ్రంగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, లూజు బట్టలు ధరించడం అవసరమని తెలిపారు అలాగే విద్యార్థులు చెరువులు, కాలువలు, నదుల వద్ద ఆడుకోవడం, ఈతలు వేయడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సీఐ విజయ కృష్ణ పేర్కొన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో నీటిలో మునిగి ప్రాణ నష్టం ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని విచారకరమైన వార్తలు అందుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు టోపీ, నీటి బాటిల్ వెంట తీసుకెళ్లాలని, తరచూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎండలో ఎక్కువసేపు ఆడకుండా, ఇంటి వద్ద లేదా చల్లని ప్రదేశాల్లో గడపాలని తెలిపారు.మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండి పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్ వంటి ఉపయోగకరమైన పనుల్లో పాల్గొనాలని విజయ్ కృష్ణ సూచించారు.వేసవి సెలవులు ఆనందంగా గడపాలంటే భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *