తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
స్థానిక జిల్లా పరిషత్ బాలురఉన్నత పాఠశాల మార్కాపురం నందు వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న డోలా. శ్యామలాదేవి, ఇటీవల థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ నందు పాల్గొని, మహిళల విభాగంలో హై జంప్ నందు బంగారు పతకం, మరియు ట్రిపుల్ జంప్ నందు బంగారు పతకం, మొత్తం రెండు బంగారు పతకాలు గెలుపొందడం జరిగింది….ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మండల తహసిల్దారు కె.చిరంజీవి మరియు మార్కాపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి యం.శ్రీనివాసులు..మండల విద్యాశాఖాధికారి కె.శర్వాణి తదితరులు హాజరయ్యారు.అనంతరం వారు వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ విజేతను దుశ్శాలువ..మెడల్స్..మెరిట్ సర్టిఫికెట్ తొ..ఘనంగా సన్మానించడం జరిగింది…ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజని, పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి రాణించటం గర్వకారణం అని కొనియాడారు….ఈ కార్యక్రమంలో పాఠశాల సహ వ్యాయామ ఉపాధ్యాయులు పి. దామోదర రెడ్డి మరియు కె.ఓబులేసు లతో పాటు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని, ఆమెను సన్మానించడం జరిగింది. ఇందులో ఎన్.సి.సి, స్కౌట్ విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది…