తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన జిఓఆర్టి సంఖ్య 2230 ద్వారా ప్రస్తుత సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాలు అనగా ఈనెల 28వ తేదీ వరకూ పొడిగిస్తూ తదుపరి సిఎస్ గా ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు ఇఓ స్పెషల్ సిఎస్ టు సియంగా ఉన్న సాయి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆమేరకు శనివారం ఉ.11.33 గం.లకు ఎపి సచివాలయంలో సాయి ప్రసాద్ నూతన సిఎస్ గా పదవీ బాధ్యతలు చేపడతారు.1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు.అనంతరం 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా,1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కమీషనర్ గా పని చేశారు.అనంతరం 1997 మే నుండి 1998 ఆగస్టు వరకు కడప జా

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *