తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం, శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తి గా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ప్రజల కు పిలుపునిచ్చారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భం గాజాయింట్ కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. సమాజంలో శెట్టిబలిజ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేశారన్నారు. శెట్టిబలిజ ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఆ రోజుల్లో పాఠశాలలు ఏర్పాటు చేశార న్నారు. శెట్టి బలిజ ప్రజల్లో చైతన్య వంతం తీసుకు రావడానికి అనేక పుస్తకాలను ఆయన ఆరోజుల్లో రచించా రన్నారు. ఈ కార్యక్ర మంలో మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్, వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్డిసి శివరామిరెడ్డి, మార్కాపురం డివిజనల్ పంచాయ తీ అధికారి బాలు నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.