తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని శ్రీ శ్రీ స్కందపురి సోమేశ్వర శివాలయం లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు, పార్టీ నాయకులు, వేద పండితులు మంత్రోచ్ఛారణలతో, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే ఆలయ అధికారులతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం కల్పించాలని సూచించారు.దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రసాదాలను ఎమ్మెల్యే దంపతులు స్వయంగా భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, వడ్డెళ్ళ రవిచంద్ర, పరిటాల రామకృష్ణ, బెజవాడ ప్రసాద్, పట్టణ తెలుగు దేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *