తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ నేర నియంత్రణలో మరింత కఠిన చర్యలు చేపడుతూ, సర్కిల్ స్థాయిలో సమగ్ర సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గిద్దలూరు రూరల్ సర్కిల్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో SHOలు, స్టేషన్ రైటర్లు మరియు కోర్టు కానిస్టేబుళ్లతో ముఖ్యమైన క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది.ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న UI కేసులపై సవివరంగా సమీక్ష జరిపి, కేసుల విచారణలో వేగం పెంచాలని, బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, నేరాల నియంత్రణలో ఎటువంటి అలసత్వం సహించబోదని హెచ్చరించారు.ప్రత్యేకంగా ఈ-సాక్ష్య (E-Sakshya) అప్‌డేషన్‌పై దృష్టి సారిస్తూ, ప్రతి కేసులో డిజిటల్ ఆధారాలను సమయానికి నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.అలాగే కనిగిరి సర్కిల్‌లో సీఐ సర్కిల్‌కు చెందిన ఎస్ఐలు మరియు టీఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CCTNSలో పెండింగ్‌లో ఉన్న వివరాల అప్‌డేషన్‌పై ప్రత్యేకంగా చర్చించి, అన్ని డేటాను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇంటెలిజెన్స్ సేకరణను బలోపేతం చేయాలని, కేసుల దర్యాప్తు నాణ్యతను పెంచాలని సూచించారు.ప్రతి పోలీస్ అధికారి తమ బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తిస్తూ, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, నేరాలపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశాలు జిల్లాలో నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారనున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *