తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో 2027 జనాభా గణనకు సంబంధించి ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో మొత్తం 151 మంది ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు. నాలుగు బ్యాచులుగా విభజించి 12 రోజులపాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వారికి సమగ్ర అవగాహన కల్పించబడింది.
శిక్షణ కార్యక్రమానికి హాజరైన సచివాలయ సిబ్బంది మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. శిక్షణను అత్యంత సమర్థంగా నిర్వహించిన ఫీల్డ్ ట్రైనర్లు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్యలను చార్జ్ ఆఫీసర్ శ్రీ ఎన్ వి బి రాజేష్ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల సమక్షంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ మరియు చార్జ్ ఆఫీసర్ శ్రీ ఎన్ వి బి రాజేష్ మాట్లాడుతూ, మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న జనాభా గణన కార్యక్రమం కోసం ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశాన్నిఏప్రిల్ 30వ తేదీ వరకు వినియోగించుకుని ముందుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
కోర్స్ డైరెక్టర్ ఏ.ఎస్.ఓ సుంకర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరూ శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *