పిబ్రవరి 28 తేదీ 3 గంటలకు శ్రీ చైతన్య స్కూల్ పరిశీలన,
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ లో ఫిబ్రవరి 14వ తేది జరిగిన 6 వ, తరగతి విద్యార్థి సయ్యద్.తౌషీక్ (11) అనుమానాస్పద మృతిపై న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారి కుటుంబానికి అండగా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో రేపు 28 తేదీ శనివారం 3 గంటలకు ఆయన మొదటిగా విద్యార్థి చదివిన శ్రీ చైతన్య స్కూల్ ని పరిశీలించి తదుపరి సరస్వతి కల్యాణ మండపంలో ప్రెస్ మీట్ జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె వీరారెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి నియోజకవర్గ, మండల ఎలక్ట్రాన్ మరియు ప్రింట్ మీడియా హాజరు కావాలని కొండపి నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి లక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజలు విరిగా పాల్గొని తౌశిక్ కుటుంబానికి అండగా నిలవాలని సిపిఐ మండల కార్యదర్శి బాలాజీ, ఏఐటీయూసీ నాయకులు జాకీర్ కోరారు.