తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.దర్శి నియోజకవర్గ అభివృద్ధి పట్ల కట్టుబడి పనిచేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషిని సీఎం అభినందించారు.ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా వినతులు సమర్పించారు.ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్ గార్లు, శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, దామచర్ల జనార్థనరావు, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బి.ఎన్. విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఏరిక్షిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *