తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

“స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులకొల్లు గ్రామ రోడ్డు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం లక్ష్యంగా ఈ ఆధునిక నిఘా చర్యలు చేపట్టారు.పొన్నలూరు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రోన్ పర్యవేక్షణ ద్వారా గ్రామ పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వెలివాడలు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ పనిచేస్తోందని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రోన్ నిఘా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *