తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లా పోలీసులు పొన్నలూరు ప్రాంతంలో డ్రోన్ నిఘా నిర్వహించారు. ఈ నిఘా ద్వారా గ్రామ పరిసరాలు, ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై ముందస్తు చర్యలు చేపట్టారు.డ్రోన్ నిఘాతో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా నియంత్రణ చేపట్టడం, ప్రజలకు భద్రతా భరోసా కల్పించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో నేర నియంత్రణ, ప్రజల రక్షణలో పోలీసులు మరింత సమర్థంగా వ్యవహరిస్తున్నారని అధికారులు తెలిపారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద విషయాలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *