రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం – సాంకేతిక పరికరాలతో నేర నియంత్రణ దిశగా మరో ముందడుగు
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ పనిచేస్తున్నారు.ఈ క్రమంలో రాత్రి గస్తీ సమయంలో పోలీసులు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ (MSCD) పరికరాన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరం సహాయంతో వ్యక్తుల వేలిముద్రలను తీసుకొని, ఆ వ్యక్తికి నేర చరిత్ర ఉన్నదా లేదా అనే వివరాలను తక్షణమే (On the Spot) గుర్తిస్తున్నారు.నేర చరిత్ర కలిగిన వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు ఉన్న వారు కనుగొనబడితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.అదేవిధంగా, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు రద్దీ ప్రదేశాలలో వాహన తనిఖీలు, అనుమానితుల పర్యవేక్షణను పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.రాత్రి వేళల్లో గస్తీ మరింత బలపరచిన నేపథ్యంలో, ప్రజలు రాత్రి ప్రయాణాలు చేసే సమయంలో గుర్తింపు కార్డు (ID Proof) తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ నేరాలు జరగకుండా పోలీసు బృందాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ప్రజలు పోలీసులకు సహకరించి, సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా పోలీసులు కోరారు.
