తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా గురువారం మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వి మార్ట్ సూపర్ మార్కెట్ తో పాటు అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదన నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. షార్ట్ సర్క్యూట్ , గ్యాస్ సిలిండర్లతో అగ్నిప్రమాదాలు వంటివి ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు దృశ్య రూపంలో చూపించి అధికారులు వివరించారు. అలానే గోడు పత్రికలను అంటించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *