తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మద్దిపాడు మండలం లోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వెనక వైపు ఉన్న అన్నంగి-బూరేపల్లి గ్రామాల పరిధిలో నూతనముగా ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధ పోలీసు పటాలం ( ఏపీ ఏడ్పు బెటాలియన్) నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా బెటాలియన్ ముఖ ద్వారం వద్ద ఆర్చి నిర్మాణం చేసి అప్రోచ్ రోడ్డు ను ఎపి ఎస్పీ ఐ జి రాజ కుమారి ప్రారంభించారు.బుధవారం ఈ కార్యక్రమాన్ని 07 బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ B. జనార్ధన రెడ్డి మరియు బెటాలియన్
కమాండెంట్ మురళి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముఖద్వారం ఆర్చి, అప్రోచ్ రోడ్డు మంగళగిరి ఎపి ఎస్పీ బెటాలియన్ ఐ జి పి బి రాజ కుమారి ప్రారంభించారు. అనంతరం నూతన బెటాలియన్ కొరకు ఏర్పాటు చెందిన నూతన వాహనాలను ఆమె ప్రారంభించారు. అంతే కాకుండా బెటాలియన్ కొరకు 3.5 కి మీ చుట్టూ పరివాహం తో పాటు 95 ఎకరముల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బెటాలియన్ నిర్మాణ పనులను ఆమెక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాణ పనులకు సహకరిస్తున్న మండల రెవెన్యూ అధికారులు, విద్యుత్తు అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం బెటాలియన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి బెటాలియన్ ప్రాంతాన్ని నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. బెటాలియన్ కి కేటాయించిన అసిస్టెంట్ కమాండెంట్ శాంతి రాజు , ఆర్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డి ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఒంగోలు రూరల్ సి ఐ మద్దినేని శేషగిరిరావు, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.
