కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర రాజధాని అమరావతిలో..
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం, అందులో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ వేడుక జరుగుతుంది.ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ సూచనతో, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి ప్రారంభోత్సవ ఆహ్వానం అందింది. కందుకూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆహ్వాన పత్రికను అందించగా…. కార్యక్రమానికి తప్పక హాజరవుతానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో కందుకూరు పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.