తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా ఉంచుతూ పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిమిడిపాలెం జగనన్న కాలనీ, గంగవరం రోడ్, మర్రిచెట్లపాలెం గ్రామం, పొదిలి రోడ్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అలాగే ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిచెట్లపాలెం ప్రాంతంలో కూడా పోలీసులు డ్రైవ్ చేపట్టారు.సంబంధిత ఎస్‌ఐలు, సీఐ గారి పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టబడ్డాయి. అనుమానాస్పద వ్యక్తులు, దుకాణాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడేందుకు మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అధికారులు తెలిపారు. గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు కూడా ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *