తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణ కార్యక్రమంలో భాగంగా బుధవారం గిద్దలూరు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని చార్జ్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి, అదనపు చార్జ్ ఆఫీసర్ ఎంపీడీవో సీతారామయ్య ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో భాగంగా మొదటి రోజు ఫీల్డ్ ట్రైనర్లు ఎం. బాల గురవయ్య, సి. రామచంద్రారెడ్డి జనగణన సర్వే నిర్వహణ విధానంపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు వివరంగా అవగాహన కల్పించారు.
ప్రతి ఇంటిని సందర్శించి, గృహ యజమానులకు నమోదు చేయవలసిన అంశాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. జనగణనలో ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దారు మరియు చార్జ్ ఆఫీసర్ ఎం. ఆంజనేయ రెడ్డి, ఎంపీడీవో సీతారామయ్య, ఏఎస్ఓ ఎండి ఫరీదా సుల్తానా బేగం, ఆర్. భాస్కరరావు, ఫీల్డ్ ట్రైనర్లు బాల గురవయ్య, రామచంద్రారెడ్డి, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *