తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

గిద్దలూరు పట్టణంలోని సబ్ జైల్ ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ప్రతి ఒక్కరి కేసుల వివరములను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి ఉండాలన్నారు, మద్యం త్రాగి మోటారు వాహనములు నడపటం నేరమన్నారు.బెయిల్ పొందిన వారు, సదరు కేసు పూర్తయ్యే వరకు, ప్రతి వాయిదాకు కోర్టు ముందు హాజరు కావాలన్నారు. సింగిల్ షూరిటీ మరియు అర్హులకు ఉచిత న్యాయ సహాయం గురించి తెలియజేశారు. నేరాలు చేయవద్దనని, కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. ఆవేశం అనర్థాయకమన్నారు. తదుపరి ఖైదీలకు అందిస్తున్న సదుపాయములను, సరుకుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరి చేశారు. ఈ కార్యక్రమంలో జైల్ ఇంచార్జ్ సూపరెండేంట్ రామకృష్ణ, లీగల్ ఎయిడ్ న్యాయవాది బి. సంధ్యారాణి పారా లీగల్ వాలంటీర్ అద్దంకి మధుసూధనరావు, జైల్ సిబ్బంది మరియు ఖైదీలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *