తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-

మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పొదిలి మండలంలోని ఏలూరు తిరునాళ్ల సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.“స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రోన్ సర్వైలెన్స్‌ను ఏర్పాటు చేసి, ఆలయం పరిసర ప్రాంతాలు మరియు తిరునాళ్ల ప్రాంగణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలతో కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు.భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, గుమికూడే ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పనిచేస్తూ, పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *