తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:-

దొనకొండ మండలం, మల్లంపేట గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత సోలార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టిడిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహ రెడ్డి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు
తదితరులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి సోలార్ ద్వారా స్వయం విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా సరికొత్త సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు.దర్శి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు 4030 ఉచిత సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ₹59 కోట్లు కేటాయించగా, మల్లంపేటలో 44 ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఓసీ, బీసీలకు సబ్సిడీ అందిస్తూ ప్రతి వర్గానికీ సోలార్ ప్రయోజనం చేకూరుస్తున్నామని తెలిపారు.వ్యవసాయం, అడవి ప్రాంతాలకు కూడా సోలార్ విద్యుత్ విస్తరిస్తూ, లో వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ పోల్స్ కోసం ₹114 కోట్లు కేటాయించి, పనులు దాదాపు 90% పూర్తయ్యాయని వివరించారు.దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ… పేదలకు ఉచిత సోలార్ అందించడం గొప్ప కార్యక్రమమని, సీఎం చంద్రబాబు గారు, ప్రధాని మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మేలు చేసే ఈ ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి విద్యుత్ అందిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న మంత్రి కృషి అభినందనీయం అన్నారు. సోలార్ ద్వారా ప్రతి ఇల్లు విద్యుత్ కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.
పనిచేసే ప్రభుత్వం – ప్రజల కోసం పనిచేసే నాయకత్వం
సోలార్ వెలుగులతో దర్శి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *