తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:-
రాష్ట్రవ్యాప్తంగా నిన్న పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు గిద్దలూరు పట్టణ సీఐ సురేష్ సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎవ్వరూ అధైర్యపడకూడదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఓదార్చి ప్రోత్సహించాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.