తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవనాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా పార్కులు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, చెరువుల వద్ద వంటి ప్రాంతాల్లో అక్రమంగా మద్యం సేవిస్తున్న ప్రదేశాలను గుర్తించి పూర్తిగా శుభ్రపరిచారు.
పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వ్యక్తులను చెదరగొట్టడంతో పాటు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. మద్యం సీసాలు, వ్యర్థాలను తొలగించి ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చారు.ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలు సామాజిక శాంతి భద్రతను దెబ్బతీస్తాయని పోలీసులు హెచ్చరించారు. కుటుంబాలతో వచ్చే ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు ఇబ్బందులు కలిగించే ఈ విధమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల సహకారంతో శాంతియుతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *