తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

జూదం బెట్టింగ్ లు మోసాలకు పాల్పడిన బహిరంగ ప్రదేశాలలో మత్తు పానీయాలు, పదార్థాలు సేవించి శాంతి భద్రతల కు ప్రజలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు అని హెచ్చరించినా సింగరాయకొండ ప్రాంతం లో ఆగడం లేదు. దానికి నిదర్శనంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ని పేరు మోసిన ఒక లాడ్జి కేంద్రంగా జూదం జరుగుచున్నట్లు అందిన సమాచారం తో పోలీస్ లు ఎస్సై బండ్లమూడి మహేంద్ర, ఎ ఎస్సై.శేషారెడ్డి సిబ్బందితో దాడి చేశారు. మంగళవారం రాత్రి చేపట్టిన ఈ దాడి లో కొందరు జూదం ప్రియులు భారీ గా జూదం ఆడుతూ పట్టుబడ్డారు. జూదం ఆడుతున్న వారి వద్దనుండి ఏడు సెల్ ఫోన్లు, ఇరవై వేల మూడు వదల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నివాస ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య సంస్థల వద్ అసాంఘిక కార్యక్రమాలు, జూదానికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *