తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
భారత దేశం లో బానిస పాలన పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ లో స్వయం పాలన చేపట్టి ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేయడం ఆఫలాలు చివరి పేదవాడి వరకు చేరితేనే డా బాబా సాహెబ్ అంబేత్కర్ ఆశయం సాధిస్తుందని సింగరాయకొండ తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ పిలుపు ఇచ్చారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతి సందర్భంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి, మండల పరిషత్ ఉప అభివృద్ధి అధికారి శారద నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగరాయకొండ ప్రత్యేక అధికారి ఎన్ వి బి రాజేష్ మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు పొందిన వారు ఫలాలు అందిపుచ్చుకోలేని వారి కి ఫలాలు అందేవిధంగా వారి అభివృద్ధింసంక్షేమం స్వాభిమానం స్వావలంబన సాధించేదిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి మండల ఉప అభివృద్ధి అధికారి శారద మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు చదువుల పట్ల శ్రద్ధ తీసుకుని తమ పిల్లల చదువు పట్ల అవగాహన పెంచుకుని బడులకు పంపాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం లో తెలుగు దేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు యద్దాని బాషా, సీనియర్ టి డి పి నాయకుడు చీమకుర్తి కృష్ణ చైతన్య, జనసేన నాయకులు ఐనాబత్తిన రాజేష్, కాసుల శ్రీనివాసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
