తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ జనసైనికులు.
ప్రపంచ రాజ్యాంగాల్లో అత్యుత్తమమైనది మన దేశ రాజ్యంగం, కుల మత జాతి వివక్షకు తావు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతావనికి ప్రజాస్వామ్య రూపాన్ని ఇచ్చి, రాజ్యాంగం అనే మహా ఆయుధాన్ని దేశ ప్రజలకు అందించిన మహానీయుడు అంబేద్కర్ గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పురుడు పోసిన దార్శనీకుడు, భారతజాతి ఔన్నత్యానికి మచ్చగా మారిన కులవ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ధీశాలి, శక్తివంతమైన ఆధునిక ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసిన వ్యక్తి, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అతిపెద్ద శక్తి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్ గారు, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, కనుమల్ల సొసైటీ సభ్యులు కూనపురెడ్డి రంగారావు , కాసులు శ్రీను , కసుకుర్తి మధుసూదన్ , శీలం జగదీష్ మరియు జనసైనికులు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.