తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

పొలాలలో వ్యర్ధాలు తగలబెట్టేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ రైతులకు సూచించారు. ఇటీవల కొంత మంది రైతులు తమ పొలంలోని వ్యర్ధాలను కాల్చి వేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ నిప్పు పక్క పొలాల పంటకు అంటుకొని తోటి రైతులు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారని సిఐ అన్నారు. కాబట్టి రైతులు ఎవరన్నా తమ పొలంలోని వ్యర్ధాలు కాల్చివేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యర్ధాలు పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉండి నిప్పును ఆర్పి వేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తోటి రైతుకు ఆర్థికంగా పంట నష్టం చేకూరుస్తే చర్యలు తప్పమన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *