తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత డా. బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవాన్ని చాటారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అంబేద్కర్ సమాజంలో సమానత్వం, హక్కులు, న్యాయం కోసం చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదలు, బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు.రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నతుడు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజంలో శాంతి, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *