తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
కేవీపీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామజిక చైతన్య బైక్ యాత్ర మంగళవారం కొణిజేడు చేరుకుంది. అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజెస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు గ్రామం లోని డా,, బి. ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది.అనంతరం కొణిజేడు గ్రామం లోని ఎస్. టీ. కాలనీ వద్ద వి. మోజెస్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేయటం జరిగింది.ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా కార్యదర్శి బి.రఘురామ్ మాట్లాడుతూ గ్రామం లో 30 ఎస్ టీ కుటుంబాలు ఉన్నాయి. కొందరు పట్టలు తో కొందరు రేకులతో ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు అని తెలిపారు. మాకు పక్కా గృహాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అని కాలనీ వాసులు మా బృందానికి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు అని తెలిపారు.కాబట్టి ప్రభుత్వమే ఈ కాలనీ వాసులకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫై సమస్య ను పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని సామజిక చైతన్య బైక్ యాత్ర బృందం డిమాండ్ చేసింది. లేనిచో ప్రజలతో కలసి ఆందోళన చేస్తాము అని తెలిపారు..ఈ కార్యక్రమం లో ఎస్ కె మీరాస్, ఎమ్. కోటయ్య, ఆర్. కుమార్, నరేంద్ర, వెంకటేశ్వర్లు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు….
