తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

భారత రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో శానంపూడి గ్రామంలోని మిట్టపాలెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువత, స్థానిక ప్రజలు పాల్గొని అంబేద్కర్ గారి సేవలను, సమాజానికి చేసిన కృషిని స్మరించుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ వారు సమానత్వం, సామాజిక న్యాయం, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి వివరించారు.ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఫోర్స్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి వేడుకలు ఉత్సాహభరితంగా, శాంతియుతంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *