తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఎండల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాదచారులు, ప్రయాణికులు, వృద్ధులు మరియు కార్మికులకు చల్లని తాగునీరు అందిస్తూ ఈ చలివేంద్రం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. పోలీస్ శాఖ కేవలం చట్టవ్యవస్థ పరిరక్షణకే కాకుండా, సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చేయడంలో ముందుంటుందనే విషయాన్ని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా నీరు తాగాలని, అవసరం లేకుండా ఎండలో తిరగకుండా ఉండాలని సూచించారు.